మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 29, 2020 , 11:44:17

నార్కట్‌పల్లిలో ట్రావెల్‌ బస్సు బీభత్సం

నార్కట్‌పల్లిలో ట్రావెల్‌ బస్సు బీభత్సం

నల్గొండ : నార్కట్‌పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదివారం తెల్లవారు జామున అదుపు తప్పి దుకాణాలపై దూసుకువెళ్లింది. ఘటన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బస్సు దూసుకువెళ్లిన ఘటనలో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. కాగా, బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా నార్కట్‌పల్లి వద్ద తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.