బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 19, 2020 , 13:15:18

బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌ : భవనంపై నుంచి దూకి ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సికింద్రాబాద్‌ పరిధిలోని గోపాల్‌పుర్‌లో చోటు చేసుకుంది. సుష్మిత (21) అనే ఉద్యోగిని టెక్‌ మహీంద్ర కంపెనీ కార్యాలయం నుంచి దూకింది. దీంతో యువతి అక్కడికక్కడే మృత్యువాతపడింది. మృతురాలు నామాలగుండులో నివాసం ఉంటోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, సుష్మిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo