గురువారం 28 జనవరి 2021
Crime - Nov 29, 2020 , 12:25:45

అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

అదుపుతప్పి దుకాణాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

నల్లగొండ : నార్కట్ పల్లి మండల కేంద్రంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు ఆదివారం తెల్లవారుజామున అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. దీంతో మూడు పండ్ల బండ్లు ద్వంసం అయ్యాయి.  ఒక దుకాణం షెట్టర్ దెబ్బ తిన్నది.  బస్సు డ్రైవర్ అతివేగంతో పాటు నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరు లేరు.

బస్సులో మాత్రం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు దుకాణంలోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో ప్రయాణికులకు ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ నార్కట్ పల్లి బస్టాండ్ ముందు అగాల్సి ఉంది.  అంతకు ముందే నల్లగొండ క్రాస్ రోడ్ దాటుతుండగా అదుపు తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


logo