శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 10, 2020 , 17:28:28

పారిపోయిన ఖైదీ అరెస్టు

 పారిపోయిన ఖైదీ అరెస్టు

హైదరాబాద్ :  పారిపోయిన ఖైదీని పోలీసులు అరెస్టు చేశారు. మొగ‌లి సోమ సుంద‌ర్ అనే ఖైదీ కొవిడ్‌-19 భారిన ప‌డ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి త‌ర‌లించారు. కొవిడ్ చికిత్స తీసుకుంటున్న క్ర‌మంలో ఖైదీ పోలీసుల క‌ళ్లు క‌ప్పి పారిపోయాడు. త‌ప్పించుకుని క‌ర్ణాట‌క‌కు పారిపోయాడు. గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు శుక్ర‌వారం బైక్‌పై వెళ్తున్న సోమ‌సుంద‌ర్‌ను గుర్తించి ప‌ట్టుకున్నారు. సోమ‌సుంద‌ర్‌ 57 నేరాల‌కు పాల్ప‌డి జైలుకు వెళ్లాడు.