నల్లగొండ : హైదరాబాద్ చంచల్గూడ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రతన్నాయక్(57) మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం విద్యానగర్ కాలనీ చెందిన ఆయన డ్యూటీకి బయల్దేరుతుండగా చాతీలో నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రతన్నాయక్ గతంలో మిర్యాలగూడ, నల్లగొండ, ఖమ్మం జైళ్లలో విధులు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర