గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 05, 2020 , 14:02:56

క‌ట్నం కోసం.. గ‌ర్భ‌వ‌తిని చంపి గంగ‌లో ప‌డేశారు

క‌ట్నం కోసం.. గ‌ర్భ‌వ‌తిని చంపి గంగ‌లో ప‌డేశారు

ల‌క్నో: క‌ట్నం కోసం గ‌ర్భ‌వ‌తి అనికూడా చూడ‌కుండా క‌డ‌తేర్చాడు భ‌ర్త‌. ఆపై ఆన‌వాలు చిక్క‌కుండా మృత‌దేహాన్ని గంగాన‌దిలో ప‌డేశాడు. అనుమానం వ‌చ్చిన‌ మామ పోలీసుల‌కు ఫిర్యాదుచేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు భ‌ర్త‌తో అస‌లు విష‌యం క‌క్కించారు. ఈ అమానుష ఘ‌ట‌న దేశ‌రాజ‌ధాని ప్రాంతం శివార్ల‌లో ఉన్న‌ ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకున్న‌ది. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌లో ఉంటున్న నేహ (30)కు నాలుగేండ్ల క్రితం వివాహ‌మ‌య్యింది. కొన్నిరోజులు బాగానే ఉన్న ఆమె భ‌ర్త, త‌న త‌ల్లిదండ్రులతో క‌లిసి అద‌న‌పు క‌ట్నంకోసం వేధించ‌డం ప్రారంభించాడు. క‌ష్టంగా కాలం గ‌డుపుతూ వ‌స్తున్న ఆమె ఈ మ‌ధ్యే గ‌ర్భం దాల్చింది. ఏమ‌నుకున్నారో ఏమో.. అత్త‌, మామ‌, భ‌ర్త క‌లిసి ఆమెను చంపేశారు. అనంత‌రం గంగా న‌దిలో ప‌డేశారు. 

అత్త‌గారింట్లో కూతురు క‌న్పించ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన‌ నేహ తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అల్లుడుతోపాటు, ఆయ‌న త‌ల్లి దండ్రులు క‌ట్నం కోసం త‌న కూతురును హింసిస్తున్నార‌ని పోలీసుల‌కు చెప్పాడు. దీంతో పోలీసులు నేహ భ‌ర్త‌ను అరెస్టు చేశారు. విచార‌ణ సంద‌ర్భంగా నేహ‌ను తామే చంపామ‌ని, మృత‌దేహాన్ని గంగా కాలువ‌లో ప‌డేశామ‌ని తెలిపాడు. దీంతో ఆయ‌న‌తోపాటు, ఆయ‌న త‌ల్లి దండ్రులు, మ‌రో ఇద్ద‌రిపై కేసు న‌మోదుచేశారు. నేహ మృత‌దేశ‌హం కోసం గాలిస్తున్నామ‌ని స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ రాజేంద‌ర్ గిరి వెల్ల‌డించారు.   


logo