సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 16:10:19

కారుపై కూలిన విద్యుత్‌ స్తంభం.. తప్పిన పెను ప్రమాదం

కారుపై కూలిన విద్యుత్‌ స్తంభం.. తప్పిన పెను ప్రమాదం

జగిత్యాల క్రైం : జగిత్యాల జిల్లా కొండగట్టు శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ కారు అడ్డుగా వచ్చిన బర్రెను తప్పించబోయి అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టగా.. స్తంభం విరిగి కారుపై పడింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. టాటా ఏస్ వాహనంలో ఓ వ్యక్తి బర్రెను ఎక్కించుకొని జగిత్యాల వైపు వస్తున్నాడు. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై కొండగట్టు దిగువ ప్రాంతంలో ఆటోలో నుంచి బర్రె ఒక్కసారిగా దూకి రోడ్డుపై పరుగులు పెట్టింది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారుకు అడ్డుగా రావడంతో హైరాన పడ్డ కారు డైవర్‌ డివైడర్‌ను తాకుతూ వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఒక్కసారి స్తంభం విరిగి కారుపై పడింది. కారులో బెలూన్లు ఓపెన్‌ కావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలతో భయటపడ్డారు. కాగా, నలుగురు విద్యార్థులనీ, కరీంనగర్‌లోని ఓ కళాశాలలో చేరేందుకు జగిత్యాల నుంచి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo