సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 14:24:20

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌

గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కొంత భాగం కూలిపోయింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రద్దీగా ఉన్న సోహ్నా రోడ్ మధ్యలో ఆరు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అయితే రెండు పిల్లర్ల మధ్య అమర్చిన కాంట్రీక్ బీమ్ స్లాబ్స్ కిందకు ఒరిగిపోయి కూలిపోయాయి. నేషనల్ హైవే అథారిటీ, స్థానిక అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. మరోవైపు హర్యానాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే అక్కడ రద్దీగా ఉండే ఒక రోడ్డు కోతకుగురికాగా, నాలుగంతస్తుల భవనం ఒక పక్కకి ఒరిగింది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo