ఉస్మానియా యూనివర్సిటీ :నిషేధిత జర్దా, పాన్ మసాలాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లెజెండ్ అపార్ట్మెంట్ ఎదురుగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో టాటా ఏస్ (ఏపీ 11 వై 6569) వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత పాన్ మసాలా 5 బ్యాగ్‌లు, జర్దా 4 బ్యాగ్‌లను పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.రెండు లక్షలు. వాహనంలోని డ్రైవర్ ఉదయ్, మార్కెటింగ్ వ్యక్తి రాకేశ్‌లను పట్టుకుని విచారించగా సైదాబాద్ వాస్తవ్యుడు రాజు ఈ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.
దీంతో ఓయూ పోలీసులు రాజు, రాకేశ్, ఉదయ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేశ్, ఉదయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. రాజు కోసం వెతుకుతున్నారు.