శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 22, 2020 , 14:16:18

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు

మంచిర్యాల : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను గోదావరి రివర్ పోలీసులు కాపాడారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌కు చెందిన సల్లూరి సుధ కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడానికి గోదావరి బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకడానికి ప్రయత్నించింది. కాగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న గోదావరి రివర్ పోలీస్ సిబ్బంది ఆమెను గమనించి కాపాడారు. ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించారు.