మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 07, 2020 , 13:24:55

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

కామారెడ్డి : జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పోలీసులు నాటు సారాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గాంధారి మండలం జెమిని తండా లోని  మూడు ఇండ్లపై పోలీసులు దాడి చేసి మొత్తం ఆరు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం ఊటని ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా నిషేధిత సారాను తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ఎక్సైజ్ శాఖ ఇన్ స్పెక్టర్ డి.సాయన్న తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. 


logo