శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 21:54:14

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

సిరిసిల్ల : పట్టణంలోని విద్యానగర్‌లో ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి, నలుగురిని అరెస్టు చేశారు. ఎస్సీ రాహుల్‌ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు జరిపారు. విద్యానగర్‌లో ఓ మహిళ ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం అందింది. దీంతో ఇంటిపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారిని టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన మహిళతో పాటు సిరిసిల్లకు చెందిన ఇద్దరు నిర్వాహకులను, వేములవాడకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo