మంచిర్యాల : జిల్లాలోని జన్నారం మండలం చింతగూడలో పోలీసులు ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 70 బైక్లు, ఐదు ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన 10 టేకు దుంగలు, 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారు చేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.