ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 17:32:57

గంటల వ్యవధిలోనే బంగారం దోపిడీని ఛేదించిన పోలీసులు

గంటల వ్యవధిలోనే బంగారం దోపిడీని ఛేదించిన పోలీసులు

అమరావతి: విజయవాడలో శుక్రవారం ఉదయం  బంగారం దుకాణంలో చోరీకీ పాల్పడ్డ నిందితులను పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. . ఈ కేసులో గుమస్తా విక్రమ సింగ్‌ ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుకాణంలో చొరబడ్డ నిందితులు గుమస్తాపై దాడి చేసి 7కిలోల బంగారం, 30లక్షల నగదును దోచుకెళ్లారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. నగర సీపీ శ్రీనివాస్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి ఐదు బృందాలను నియమించి దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో ముందుగా గుమస్తా విక్రంసింగ్‌ను విచారించగా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనతో పాటు రాజస్థాన్‌కు చెందిన మరో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo