బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 20, 2020 , 08:30:02

బావను చంపేందుకు సుపారీ.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

బావను చంపేందుకు సుపారీ.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

రాయదుర్గం : బావను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిన కానిస్టేబుల్‌పై పోలీసుశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షౌకత్ తన బావను అంతమొందించేందుకు ఓ ముఠాకు డబ్బులు ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు  షౌకత్‌తోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. షౌకత్ సుపారీ ఇచ్చి హత్యకు పథకం వేశాడని వెల్లడికావడంతో అతడిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సస్పెండ్ చేశారు. సుపారీ తీసుకున్న వారిలో నలుగురు ఆటో డ్రైవర్లని పోలీసులు గుర్తించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo