సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 16:00:35

రమ్మీ గేమ్స్ కు బానిసై...పోలీస్ కానిస్టేబుల్ బలవన్మరణం....!

 రమ్మీ గేమ్స్ కు బానిసై...పోలీస్ కానిస్టేబుల్ బలవన్మరణం....!

 చెన్నై:ఇటీవల కాలంలో ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకి పబ్జి ఆన్లైన్ గేమ్ కు బానిసై ఎంతోమంది యువకులు, స్కూల్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ రమ్మీ, స్నూకర్, వంటి గేముల్లో డబ్బులు పెట్టి అప్పుల పాలవుతున్నారు. ఇక తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ సైతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. దీంతో అతను ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాల్లో చోటు చేసుకున్నది. ధర్మపురి జిల్లాకు చెందిన వెంకటేషన్ సేలం జిల్లాలో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా వెంకటేషన్ ఆన్లైన్ రమ్మీకి బానిసై లక్షల్లో డబ్బును పోగొట్టుకున్నాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo