ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 05, 2020 , 16:39:38

సిరిసిల్లలో కోడి పందాలు.. ఏడుగురి అరెస్ట్‌

సిరిసిల్లలో కోడి పందాలు.. ఏడుగురి అరెస్ట్‌

రాజన్న సిరిసిల్ల : కోడి పందాలు నిర్వ‌హిస్తున్న ఏడుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణం సాయి నగర్ లో పందెం పెట్టుకొని కోడి పందాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పందెం రాయుళ్లు రాజా సింగ్, రాజు సింగ్, శివ, కిరణ్, బాలయ్య, నర్సింగ్, వెంకటేష్ అనే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7,450 నగదు, రెండు బైక్ లు, మూడు సెల్ ఫోన్ లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం సిరిసిల్ల పట్టణ పోలీసులకు అప్పగించారు.