శుక్రవారం 30 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 15:52:46

ప‌ట్ట‌ప‌గ‌లు జేసీబీ ఉప‌యోగించి చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

ప‌ట్ట‌ప‌గ‌లు జేసీబీ ఉప‌యోగించి చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

ఢిల్లీ : ప‌ట్ట‌ప‌గ‌లే జేసీబీ ని ఉప‌యోగించి మ‌రి చోరీల‌కు పాల్ప‌డుతున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాన న‌గ‌రం ఢిల్లీలో చోటుచేసుకుంది. జ‌న‌క్‌పురి ప్రాంతంలో కాప‌ర్ వైర్ల‌ను చోరీ చేస్తున్న ఎనిమిది మంది ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఎంటీఎన్ఎల్ సైట్‌లో జేసీబీని ఉప‌యోగించి అండ‌ర్‌గ్రౌండ్ కేబుల్స్‌ను ముఠా త‌వ్వి తీస్తోంది. కేబుల్స్‌లోని రాగిని బ‌య‌ట‌కుతీసి మార్కెట్లో విక్ర‌యిస్తున్నారు. ఎవ‌రికి ఎటువంటి అనుమానం రాకుండా ముఠా నాయ‌కుడు ప‌క్క‌గా ప్ర‌ణాళిక‌ను ర‌చించాడు. ఎంటీఎన్ఎల్ నుండి ఒక న‌కిలీ ఆర్డ‌ర్ కాపీని సృష్టించి ఈ ప్రాంతంలో త‌వ్వ‌కాల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లుగా లేఖ‌లో పేర్కొన్నాడు. ఎవ‌రికి ఎటువంటి సందేహాలు త‌లెత్త‌కుండా వ‌ర్క‌ర్ల వ‌లె త‌యారై, అన్ని భ‌ద్ర‌తా నిబంధ‌న‌లు పాటిస్తూ ఆప‌రేష‌న్‌ను అమ‌లు చేశారు. ముఠా నాయ‌కుడు అజారుద్దీన్ ఇప్ప‌టికే ఇలాంటి మూడు దోపిడీ ఘ‌ట‌న‌ల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులంద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి స్వస్థ‌లం బిహార్‌లోని త‌ర‌న్ గ్రామం. రూ. 6 ల‌క్ష‌ల విలువైన రాగి వైర్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.