బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 03, 2020 , 15:17:45

గూగుల్ స‌హాయంతో బాల్య వివాహాన్ని ఆపిన పోలీసులు

గూగుల్ స‌హాయంతో బాల్య వివాహాన్ని ఆపిన పోలీసులు

ముంబై : గూగుల్ స‌హాయంతో ఓ బాల్య‌వివాహాన్ని పోలీసులు ఆపారు. వ‌రుడితో పాటు ఇరు కుటుంబాల‌కు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మ‌హారాష్ర్ట‌లోని దాంబివ‌లి ఏరియాలో బాల్య వివాహం జ‌రుగుతున్న‌ట్లు న‌వ్ పాడ పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో పోలీసులు రెండు బృందాల‌ను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. అయితే పెళ్లి ఎక్క‌డ అవుతుంద‌నే జాడ పోలీసుల‌కు దొర‌క‌లేదు. మొత్తానికి బాల్య‌వివాహం గురించి స‌మాచారం ఇచ్చిన సామాజిక కార్య‌క‌ర్త వ‌ద్ద వ‌రుడి కుటుంబానికి సంబంధించిన ఫోన్ నంబ‌ర్ల‌ను సంప్ర‌దించారు.

గూగుల్ స‌హాయంతో ఆ ఫోన్ నంబ‌ర్ల‌ను ట్రేస్ చేసి పెళ్లి జ‌రుగుతున్న సాగ‌ర్లి గ్రామానికి పోలీసులు చేరుకున్నారు. అక్క‌డున్న 26 ఏళ్ల వ‌రుడితో పాటు ఇరు కుటుంబాల‌కు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై బాల్య వివాహ చ‌ట్టం 2006లోని 9, 10, 11 సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు పోలీసులు. 

బాలిక త‌ల్లిదండ్రులు నిరుపేద‌లు. కూర‌గాయ‌లు అమ్ముతూ జీవ‌నం సాగిస్తున్నారు. ఆర్థిక ప‌రిస్థితులు బాగా లేనందున‌.. బాల్య వివాహం చేసేందుకు బాధితురాలి త‌ల్లిదండ్రులు నిర్ణ‌యం తీసుకున్నారు. 


logo