మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 17:52:12

దొంగ అరెస్టు.. విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం

దొంగ అరెస్టు.. విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు స్వాధీనం

వ‌రంగ‌ల్ అర్బ‌న్ : ఓ దొంగ‌ను అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి వ‌ద్ద నుంచి రూ.1.10 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్ట‌ర్ ఎల్ ర‌మేశ్ కుమార్ నేతృత్వంలోని సెంట్ర‌ల్ క్రైం స్టేష‌న్ పోలీసులు మ‌డికొండ పోలీసుల‌తో క‌లిసి శ‌నివారం సంయుక్తంగా రైడ్ చేశారు. నిందితుడిని న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన సిలివేరు శేఖ‌ర్‌(32)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

శేఖ‌ర్ లారీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. మందుకు బానిస‌య్యాడు. సుల‌భంగా డ‌బ్బు సంపాద‌న కోసం దొంగ‌త‌నాల‌కు అల‌వాటు ప‌డ్డాడు. తాళం వేసిన ఇళ్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాత్రిపూట దొంగ‌త‌నానికి పాల్ప‌డేవాడు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని మ‌డికొండ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి, ఘ‌ణ‌పురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గ‌తేడాది ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌లో దొంగ‌త‌నాల‌ను పాల్ప‌డ్డాడు. పోలీసులు నేడు నిందితుడిని మ‌డికొండ చౌర‌స్తా వ‌ద్ద అరెస్టు చేశారు.


logo