గురువారం 21 జనవరి 2021
Crime - Oct 27, 2020 , 16:29:55

వికారాబాద్ అడ‌వుల్లో కాల్పుల కేసులో పురోగ‌తి

వికారాబాద్ అడ‌వుల్లో కాల్పుల కేసులో పురోగ‌తి

వికారాబాద్ : వికారాబాద్ అడ‌వుల్లో కాల్పుల కేసులో పురోగ‌తి ల‌భించింది. దామ‌గుండంలో నాలుగు రోజుల క్రితం ఓ ఆవును కాల్చి చంపిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని ప్ర‌ముఖ క్రీడాకారిణికి చెందిన ఫామ్ హౌజ్ ఇంచార్జి ఉమ‌ర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కీల‌క స‌మాచారం సేక‌రించారు. ఆవును చంపేందుకు ఉప‌యోగించిన తుపాకీ ఎక్క‌డ్నుంచి అత‌నికి చేరింది అనే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బుల్లెట్ ఏ రివాల్వ‌ర్ నుంచి వ‌చ్చిందో తెలుసుకునేందుకు య‌త్నిస్తున్నారు.  పశువులను మేతకు తీసుకురావొద్దని కొద్ది రోజుల క్రితం నుంచి త‌మ‌ను ఫామ్ హౌజ్  సిబ్బంది హెచ్చ‌రిస్తున్న‌ట్లు స్థానికులు తెలిపారు. 


logo