శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 01, 2020 , 14:55:51

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ట్రాఫిక్‌ ఏసీపీని పొట్టనబెట్టుకున్న డ్రైవర్‌ అరెస్ట్‌

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ట్రాఫిక్‌ ఏసీపీని పొట్టనబెట్టుకున్న డ్రైవర్‌ అరెస్ట్‌

న్యూ ఢిల్లీ: దేశ రాజధానిలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ఓ ట్రాఫిక్‌ ఏసీపీని పొట్టనబెట్టుకున్న డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సదరు డ్రైవర్ రాజోక్రీ ఫ్లైఓవర్ సమీపంలో ట్రాఫిక్‌ ఏసీపీ సంకేత్‌ కౌశిల్‌ను తన వాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కౌశిల్‌ ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 25 న డ్రైవర్ రాజోక్రీ ఫ్లైఓవర్ సమీపంలో కౌశిల్‌ను తన టెంపో వాహనంతో ఢీకొట్టాడు. కౌశిల్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడు చనిపోయినట్లు ప్రకటించారు. కాగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్‌ అమిత్ పులామిగా గుర్తించారు. అతడు మహిపాల్పూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. పులామి నేపాల్‌ దేశస్తుడు. జీవనోపాధి కోసం ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి వచ్చాడు.  అతడిపై ఐపీసీ సెక్షన్ 279 (రాష్ డ్రైవింగ్), 304 ఏ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద వసంతకుంజ్ సౌత్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టారు. 

దర్యాప్తు సమయంలో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. ప్రమాదస్థలంలో దొరికిన ఇనుప వస్తువు భాగాన్ని క్షుణ్నంగా పరిశీలించి, అది ఒక టెంపోదని తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలన్నింటినీ పరిశీలించారు. జూలై 31న వాహనం వివరాలు తెలుసుకున్నారు. న్యూ ఢిల్లీలోని  రంగపురిమహిపాల్‌పూర్‌లో టెంపోను గుర్తించారు. దీని ఆధారంగా డ్రైవర్‌ను పట్టుకొని, విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo