గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 23, 2020 , 10:50:45

కరుడుగట్టిన రౌడీషీటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

కరుడుగట్టిన రౌడీషీటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌ : 16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్ డేవిడ్ రాజును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు గతంలో ఎర్రగడ్డలో ఒకే రోజు జరిగిన ఏడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. 1991 నుంచి ఎస్సార్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌తో పాటు నగరంలో వివిధ పోలీస్‌స్టేషన్లలో రాజుపై పలు కేసులు ఉన్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.