ఆదివారం 05 జూలై 2020
Crime - May 20, 2020 , 18:40:24

ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి... తాను తీసుకుని

ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి... తాను తీసుకుని

మేడ్చల్‌ : జిల్లాలోని షామీర్‌పేటలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదంలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలైయ్యారు. ఘటన వివరాలిలా ఉన్నాయి. గోపినాథ్‌, ప్రీతి అనే దంపతులు షామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో గత కొంతకాలంగా నివసిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో తాజాగా సైతం గొడవ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి తన ఇరువురి కొడుకులకు గౌరవ(4), కౌశిక్‌(3) విషయం ఇచ్చి తాను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స నిమిత్తం స్థానిక లీలా హాస్పటల్‌లో చేర్చగా చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తల్లి ప్రీతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇష్టపడి పెళ్లి చేసుకుని...

ప్రీతిని తన చిన్నప్పుడే గుర్తుతెలియని వ్యక్తులు జనగాం రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఓ అనాథ ఆశ్రమం చిన్నారిని చేరదీసి పెంచి పెద్దచేసింది. గోపినాథ్‌ అనే యువకుడు అనాథ అమ్మాయిని పెండ్లి చేసుకుంటానని చెప్పి అనాథ ఆశ్రమంకి వెళ్లాడు. అక్కడ ప్రీతిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. శామీర్‌పేట మండలం మజీద్‌పూర గ్రామంలో కాపురం పెట్టాడు. గోపినాథ్‌ తుర్కపల్లిలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి వివాహమై ఆరు సంవత్సరాలు గడిచింది. ఇద్దరు పిల్లలు. కాగా దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఇష్టపడి పెండ్లి చేసుకుని కష్టాల పాలు చేశాడు. ఇలా గొడవపడ్డ ప్రతిసారి ప్రీతి తను పెరిగిన అనాధాశ్రమంకు వెళ్తూ  ఉండేది. ఇలా తరచుగా జరుగుతుండేది. ఈసారి మాత్రం తీవ్ర మనస్థాపానికి గురై పిల్లలకు పురుగులమందు తాగించి తాను తాగింది. 


logo