మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 13:56:25

చెరువులో విష ప్రయోగం..? చేప పిల్లల మృతి

చెరువులో విష ప్రయోగం..? చేప పిల్లల మృతి

సూర్యాపేట  : జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువులో సుమారు 15 టన్నుల చేపలు మరణించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య ,పోలీస్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. విషప్రయోగం నిర్ధారణ కోసం నీటి నమూనాను సేకరించి  పంపించారు.

గత 30 సంవత్సరాల కాలంలో ఏనాడు ఇలా జరగలేదని దీనివల్ల మత్స్యకారులకు సుమారు 20 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడి మత్స్యకారుల కు నష్టం చేసే  వారిపై పై కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.  ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం అందించే చేపపిల్లలు చెరువులో పోయాల్సి ఉన్న సమయంలో ఇలా జరగడం పట్ల మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
logo