ఎలుకను చంపబోయి.. తానే చనిపోయింది!

భిలాయ్ : కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న తప్పిదాలు మరణానికి కారణమవుతుంటాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ యువతి.. ఎలుకలను చంపేందుకు విషం నింపిన ఆహారాన్ని ఏమరుపాటుగా తీసుకోవడంతో చనిపోయింది.
దుర్గ్ దీపారాపారా ప్రాంతానికి చెందిన పాయల్ సాహు అనే 20 ఏండ్ల యువతి.. ఇంట్లో ఎలుకను చంపడానికి రెండు టమాటా ముక్కల్లో విషాన్ని కలిపింది. పనిలో బిజీగా ఉన్న సమయంలో అనుకోకుండా టమాట ముక్కలను తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చికిత్స నిమిత్తం దగ్గర్లోని దవాఖానకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి 9.30 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. విషం కలిపిన టమోటా కచుమార్ సలాడ్ తిన్న తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని కుటుంబం పోలీసులకు తెలిపింది. యధాప్రకారంగా వంటింట్లో భోజనం చేస్తుండగా.. పక్కనే ఉన్న టమోట సలాడ్‌ను విషం కలిపిన విషయం మరిచిపోయి తిన్నదని, దాంతో తీవ్రంగా వాంతులు చేసుకోవడంతో అనుమానించి దవాఖానకు తరలించినట్లు యువతి కుటుంబసభ్యులు చెప్తున్నారు.
ఇలా ఉండగా, యువతి మరణం విషయంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషం కలిపిన టమాట ముక్కలు తినిపించి చంపబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబం ప్రస్తుతం కొంత సమాచారాన్ని దాచిపెడుతున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అధికారంలోకి రాకముందే చైనా, పాక్‌లకు అమెరికా హెచ్చరికలు
- బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ నాయకుడి ఆర్థికసాయం
- బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. ఒకరు మృతి
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష