గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 16, 2020 , 08:23:29

ప్లాస్మా ఇస్తానంటూ మోసం

ప్లాస్మా ఇస్తానంటూ మోసం

హైదరాబాద్‌: కరోనా  కాలంలోసైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరూ ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు కొల్లగొడుతుండగా మరికొందరు కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.  వైరస్‌ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా తీసుకొని చికిత్స పొందుతున్న వారికి ఇవ్వడంతో త్వరగా నయమవుతుందని వైద్యులు సూచిస్తుండడంతో కొందరు నేరగాళ్లు ఈ అవకాశాలన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

సందీప్‌రెడ్డి అనే పేరుతో ఓ వ్యక్తి వాట్పాప్‌, ఫేస్‌బుక్‌లో తాను కరోనా నుంచి కోలుకున్నానని, తన ప్లాస్మాను రూ.4వేలకు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కొందరు అతడు సూచించిన ఖాతాకు నగదును పంపించారు. ఆ తరువాత నిందితుడు సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌‌ చేయడంతో మోసపోయామని గ్రహించిన నలుగురు కుటుంబ సభ్యుల బాధితులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వెల్లడించారు. 


logo