బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 03, 2020 , 14:44:30

య‌జ‌మాని చ‌నిపోవ‌డంతో కుక్క ఆత్మ‌హ‌త్య‌

య‌జ‌మాని చ‌నిపోవ‌డంతో కుక్క ఆత్మ‌హ‌త్య‌

ల‌క్నో : ఎంతో ప్రేమ‌గా చూసుకున్న య‌జ‌మాని చ‌నిపోవ‌డంతో.. ఓ కుక్క ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

డాక్ట‌ర్ అనితా రాజ్ సింగ్ కాన్పూర్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నారు. మాలిక్ పురంలో నివ‌సిస్తున్న అనితా సింగ్ కు.. తాను ప‌ని చేస్తున్న ఆస్ప‌త్రి ప‌క్క‌న గాయాల‌తో ప‌డి ఉన్న కుక్క పిల్ల‌ను 12 ఏళ్ల క్రితం చేర‌దీసింది. అప్ప‌ట్నుంచి ఆ కుక్క‌ను త‌మ ఇంటి మ‌నిషిగా చూసుకుంటున్నారు అనితా సింగ్. 

డాక్ట‌ర్ బుధ‌వారం చ‌నిపోయింది. దీంతో ఆమె మృత‌దేహాన్ని ఆస్ప‌త్రి నుంచి ఇంటికి తీసుకువ‌చ్చారు. ఇక ఆ కుక్క త‌న య‌జ‌మాని మృత‌దేహాన్ని చూసి రోదిస్తూ క‌న్నీరు పెట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాక‌.. ఆ శున‌కం రెండో అంత‌స్తు పైకెళ్లి కింద‌కు దూకింది. దీంతో కుక్కు ప్రాణాలు విడిచింది. అనిత మృతితో కుక్క తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గురైన‌ట్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. అనిత మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన అనంత‌రం.. త‌మ ఇంటి సమీంప‌లో కుక్క క‌ళేబ‌రాన్ని పూడ్చిపెట్టారు. 


logo