గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 23, 2020 , 12:56:58

గుంటిమడుగు వాగులో గల్లంతైన వ్యక్తులు మృతి

 గుంటిమడుగు వాగులో గల్లంతైన వ్యక్తులు మృతి

నాగర్‌కర్నూల్/పెద్దకొత్తపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం చిన్న కారు పాముల గ్రామ సమీపంలోని గుంటిమడుగు వాగులో గల్లంతైన బుచ్చిరెడ్డి, నరేందర్ రెడ్డిల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న పశువులు మేపుతూ వాగు దాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు గల్లంతయ్యారు. మృతదేహాలకు అధికారులు డాక్టర్ల చే పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.