సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 20:45:31

చోరీ కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

చోరీ కేసుల్లో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

ఖమ్మం : జిల్లాలో పలు చోరీ కేసుల్లో ప్రధాన నిందుతుడైన ఎడవల్లి రవి(28)పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఏన్కూర్ మండలం జెన్నారం గ్రామానికి చెందిన ర‌వి వృత్తిపరంగా మెకానిక్ అయినప్పటికీ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నేరాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. నిందితుడిపై ఇప్పటివరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 7 కేసులు నమోదు అయినట్లు వివరించారు.