గురువారం 21 జనవరి 2021
Crime - Nov 18, 2020 , 10:37:19

నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీయాక్ట్‌

నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీయాక్ట్‌

మంచిర్యాల : కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మహారాష్ట్ర నుంచి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న చంద్రాపూర్‌ జిల్లాకు చెందిన మార్కవార్‌ రమేశ్‌ భాస్కర్‌ అనే వ్యక్తిపై పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు రామడుగుండం పోలీస్‌ కమిషనర్‌ వీ సత్యనారాయణ తెలిపారు. నకిలీ, కల్తీ విత్తనాలు మహారాష్ట్ర ప్రాంతం నుంచి తక్కువ ధరకి తీసుకువచ్చి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, తాళ్లగురిజాల, భీమిని మండలాల రైతులకు ప్రభుత్వ ఆమోదిత పత్తి విత్తనాలుగా నమ్మించి తన అనుచరుల ద్వారా అమ్ముతున్నాడు. ఆ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు చాలా నష్టపోయి.. కనీసం పెట్టుబడి రాక ఇబ్బందులుపడ్డారు. దీంతో నిందితుడిపై పీడీయాక్ట్‌ నమోదు చేశారు. ఈ మేరకు చెన్నూర్‌ రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ నిందితుడికి నిర్బంధ ఉత్తర్వులను అందజేసి, వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo