మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 03, 2021 , 21:53:47

హ్యుమన్‌ ట్రాఫికర్స్‌ ఇద్దరిపై పీడీ యాక్ట్‌ నమోదు

హ్యుమన్‌ ట్రాఫికర్స్‌ ఇద్దరిపై పీడీ యాక్ట్‌ నమోదు

హైదరాబాద్‌ : మానవ అక్రమ రవాణాదారులు ఇద్దరిపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఎం.రాజేశ్వరి(27), బి. నరేశ్‌(25)ను ప్రివెన్‌టీవ్‌ డిటెన్షన్‌(పీడీ) యాక్ట్‌ కింద బుక్‌ చేశారు. ఇరువురు నగరంలోని ఉప్పల్‌ పరిధిలో గల సత్యనగర్‌ కాలనీవాసులు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌ నుంచి మహిళలను తీసుకువచ్చి అద్దె ఇండ్లలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాల కల్పనతో యువతులను కూడా ప్లాన్‌ ప్రకారం ఈ రోంపిలోకి లాగుతున్నారు. ఇరువురిని గడిచిన డిసెంబర్‌లో అరెస్టు చేసిన పోలీసులు వీరి చెర నుంచి ఇద్దరు యువతులను రక్షించారు.