సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 25, 2020 , 19:16:11

గుట్కా వ్యాపారిపై పీడీ యాక్ట్‌ న‌మోదు

గుట్కా వ్యాపారిపై పీడీ యాక్ట్‌ న‌మోదు

న‌ల్ల‌గొండ : నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణా, మార్కెటింగ్‌కు పాల్ప‌డుతున్న వ్యాపారిపై న‌ల్ల‌గొండ పోలీసులు శ‌నివారం నాడు పీడీ యాక్ట్ న‌మోదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... న‌ల్ల‌గొండ మండ‌లానికి చెందిన మ‌ర్రిగూడ‌కు చెందిన బుర్రా లింగ‌య్య అలియాస్ సతీష్ గుట్కా ప్యాకెట్ల రవాణా, అమ్మకాలకు సంబంధించి 11 కేసులలో నిందితుడిగా ఉన్న‌ట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో న‌ల్ల‌గొండ టూ టౌన్ పోలీసులు లింగయ్యపై పీడీ చట్టాన్ని అమలు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించిన‌ట్లు చెప్పారు. 

పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుట్ఖా ప్యాకెట్లను నిషేధించిన‌ట్లు తెలిపారు. పీడీఎస్ బియాన్ని కొంద‌రు వ్య‌క్తులు, రేష‌న్ డీల‌ర్లు అక్ర‌మ ర‌వాణా చేస్తున్న‌ట్లు స‌మాచారం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.

తాజావార్తలు


logo