శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 22:30:11

పవన్ బర్త్‌డే బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..నలుగురికి గాయాలు

పవన్ బర్త్‌డే బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..నలుగురికి గాయాలు

చిత్తూరు : రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా  చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. శాంతిపురంలో పవన్ అభిమానులు బర్త్ డే బ్యానర్‌లు కడుతున్న సమయంలో అపశృతి జరిగింది. ఏడోమైలు వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ఐదుగురికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మరణించారు. మృతులు కడపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 


logo