గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 13:41:07

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికురాలు మృతి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో  ప్రయాణికురాలు మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి తిరుపతి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికురాలు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.  కోల్‌కతాకు చెందిన జశోద అనే మహిళ విమానంలో శంషాబాద్‌కు వచ్చి తిరుపతికి వెళ్లేందుకు మరో విమానంలో ఎక్కుతుండగా ఆమె కుప్పకూలి కిందపడింది. గమనించిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటీనా ఎయిర్‌పోర్ట్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఆమె చికిత్సపొందుతూ మృతిచెందింది. ఆమె గత కొన్ని రోజులుగా  క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. logo