బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 16:56:49

ఆర్‌జీఐఏలో బంగారం స్మ‌గ్లింగ్‌.. వ్య‌క్తి అరెస్టు

ఆర్‌జీఐఏలో బంగారం స్మ‌గ్లింగ్‌.. వ్య‌క్తి అరెస్టు

రంగారెడ్డి : బ‌ంగారం స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో గ‌డిచిన రాత్రి చోటుచేసుకుంది. ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా క‌స్ట‌మ్స్ అధికారులు రియాద్ నుంచి వ్య‌క్తి వ‌ద్ద బంగారాన్ని గుర్తించారు. 233.06 గ్రాముల బ‌రువున్న రెండు గోల్డ్ బార్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 12.22 ల‌క్ష‌లుగా స‌మాచారం. జీన్స్‌కు ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్న ప్యాకెట్ల‌లో బంగారాన్ని ఉంచి అక్ర‌మంగా తీసుకువ‌చ్చాడు. త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. 


logo