ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 14:00:59

పిల్ల‌ల‌ను దూషించాడ‌ని కొట్టి చంపారు

పిల్ల‌ల‌ను దూషించాడ‌ని కొట్టి చంపారు

ల‌క్నో : కొంత‌మంది పిల్ల‌లు ఓ చెట్టుపై ఉన్న పండ్ల కోసం రాళ్ల‌ను విసిరారు. ఆ రాళ్లు.. చెట్టుకు క‌ట్టేసిన బ‌ర్రెకు తాకాయి. బ‌ర్రె య‌జ‌మాని.. రాళ్లు విసిరిన పిల్ల‌ల‌ను దూషించాడు. దీంతో ఆ య‌జ‌మానిని పిల్ల‌ల త‌ల్లిదండ్రులు క‌లిసి కొట్టి చంపారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ డియోరాయి జిల్లాలోని చందౌలి గ్రామంలో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

జై ప్ర‌కాశ్ కుష్వాహా(55) అనే వ్య‌క్తికి ఓ బ‌ర్రె ఉంది. దాన్ని నేరేడు పంట్ల చెట్టుకు క‌ట్టేశాడు. అయితే కొంత‌మంది పిల్ల‌లు క‌లిసి.. నేరేడు పండ్ల కోసం పైకి రాళ్లు విసిరారు. ఆ రాళ్లు బ‌ర్రెకు తాకాయి. చెట్టుపైకి రాళ్లు వేయొద్ద‌ని పిల్ల‌ల‌కు ప్ర‌కాశ్ సూచించాడు. అయిన‌ప్ప‌టికీ పిల్ల‌లు విన‌లేదు. కోపంతో ఊగిపోయిన ప్ర‌కాశ్.. పిల్ల‌ల‌ను దూషించాడు. 

 అన్సారీ అనే వ్య‌క్తి వ‌చ్చి త‌మ పిల్ల‌ల‌ను ఎందుకు దూషించావు అంటూ.. ప్ర‌కాశ్ వ‌ద్ద గొడ‌వ పెట్టుకున్నాడు. ఇది కాస్త ముదిరింది. అంద‌రూ అక్క‌డ పోగై.. ప్ర‌కాశ్‌ను కొట్టి చంపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   


logo