సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 23, 2020 , 15:22:19

‘విమానంలో ఉగ్రవాదులున్నారు..’ ఒక వ్యక్తి హంగామా

‘విమానంలో ఉగ్రవాదులున్నారు..’ ఒక వ్యక్తి హంగామా

న్యూఢిల్లీ: విమానంలో ఉగ్రవాదులున్నారంటూ ఒక వ్యక్తి హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన జియా ఉల్ హక్ గురువారం ఢిల్లీ నుంచి గోవాకు ఎయిర్‌ ఇండియా విమానంలో బయలుదేరాడు. అది ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా అతడు ఒక్కసారిగా తన సీటు నుంచి పైకి లేచాడు. విమానంలో ఉగ్రవాదులున్నారని అరుస్తూ వింతగా ప్రవర్తించాడు. తాను ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ అధికారినని పేర్కొన్నాడు. దీంతో తోటి విమాన ప్రయాణికులు హడలిపోయారు. కాగా, గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ కాగానే ఎయిర్‌పోర్టు అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు జియా కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo