ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 08:54:16

ప్రేమించినందుకు.. యువకుడికి మూత్రం తాగించారు

ప్రేమించినందుకు.. యువకుడికి మూత్రం తాగించారు

జైపూర్‌ : తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించడమే అతను చేసిన పాపం. మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావంటూ.. ఆ యువకుడిని తీవ్రంగా చితకబాది, బలవంతంగా మూత్రం తాగించారు. ఈ అమానవీయ సంఘటన రాజస్థాన్‌లోని శిరోహిలో జూన్‌ 11న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

శిరోహి జిల్లాకు చెందిన ఓ యువకుడు.. తన మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరివి ఒకే కులాలు. అయినప్పటికీ వీరి ప్రేమను కుల పెద్దలు తిరస్కరించారు. అంతేకాదు.. ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. షూలో మంచినీరు పోసి తాగించారు. ఆ తర్వాత ఓ సీసాలో మూత్రం తీసుకువచ్చి బలవంతంగా తాగించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


logo