బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 14:10:25

ఫేస్‌బుక్‌ లైవ్‌ ఆన్‌ చేసి.. ఉరి వేసుకున్నాడు

ఫేస్‌బుక్‌ లైవ్‌ ఆన్‌ చేసి.. ఉరి వేసుకున్నాడు

పాల్ఘర్ : మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని జవహర్ పట్టణంలో 22 ఏండ్ల యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో వీడియో రికార్డు చేస్తూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాల్ఘర్‌లోని వాడా తాలూకాకు చెందిన నవనాథ్ భాంజే స్థానికంగా ఓ ఫుడ్‌ కంపెనీలో పని చేస్తుండేవాడు. తోటి ఉద్యోగులతో కలిసి యజమాని ఇంట్లో ఉండేవాడు. గురువారం మధ్యాహ్న భోజన విరామంలో నవనాథ్‌ ఒక గదిలోకి వెళ్లి తాళం వేసుకొని ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఆన్‌ చేసి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. లైవ్‌లో నవనాథ్‌ ఉరివేసుకునే ఘటనను వీక్షించిన అతడి సహచరులు, మిత్రులు తొందర పడవద్దు అని కామెంట్లు, ఫోన్‌లు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. 

అయితే యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలియరాలేదని, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని జవహర్ ఎస్‌ఐ అప్పసాహెబ్ లెంగ్రే శుక్రవారం చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo