శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 16:11:45

కరోనా సోకిందని స్వీట్‌ షాప్‌ ఓనర్‌ ఆత్మహత్య

కరోనా సోకిందని  స్వీట్‌ షాప్‌ ఓనర్‌ ఆత్మహత్య

చెన్నై: కరోనా వైరస్ సోకిందని భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో ఈ ఘటన జరిగింది.   తిరునల్వేలిలో ఫేమస్‌  స్వీట్ షాప్ ఇరుట్టు కడై హల్వా స్టోర్ యజమాని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 75ఏండ్ల  హరిసింగ్ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయిన గంట తర్వాత ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్‌ నుంచి 1940లో తమిళనాడుకు వలస వచ్చిన సింగ్‌ కుటుంబం తిరునల్వేలిలో షాపు ఏర్పాటు చేసుకుంది.   గత 80 ఏండ్ల నుంచి ఆ  కుటుంబంలోని మూడు తరాలు దుకాణాన్ని నడుపుతున్నది.  

మూత్రసంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న హరి సింగ్‌ గత మంగళవారం ఆస్పత్రిలో చేరారు. సింగ్‌తో పాటు అతని అల్లుడి  దగ్గర నుంచి శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్ష చేయగా ఇద్దరికీ పాజిటివ్‌గా తేలింది. పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం 11 గంటల సమయంలో రాగా..మధ్యాహ్నం సమయంలో హరిసింగ్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తిరునల్వేలి డీసీపీ శరవణన్‌ తెలిపారు. 


logo