శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 14:49:44

భారీ అగ్నిప్ర‌మాదం.. 80 షాపులు ద‌గ్ధం

భారీ అగ్నిప్ర‌మాదం.. 80 షాపులు ద‌గ్ధం

చెన్నై : త‌మిళ‌నాడు ఊటీ ప‌రిధిలోని ఉధ‌గా మండ‌లం మున్సిప‌ల్ మార్కెట్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 80కి పైగా దుకాణాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. స్థానికులు అందించిన స‌మాచారంతో.. అక్క‌డికి అగ్నిమాప‌క సిబ్బంది చేరుకుంది. నాలుగున్న‌ర గంట‌ల‌కు పైగా శ్ర‌మించి మంట‌ల‌ను ఆర్పివేసింది. 

ఈ సంద‌ర్భంగా నీల‌గిరి జిల్లా అగ్నిమాప‌క శాఖ అధికారి ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింద‌ని తెలిపారు. టీ స్టాల్స్ లోని మూడు ఎల్పీజీ సిలిండ‌ర్లు పేల‌డం వ‌ల్లే అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయ‌ని చెప్పారు.  త‌మ సిబ్బంది.. అప్ర‌మ‌త్త‌మై మిగ‌తా షాపుల్లో ఉన్న మ‌రో 8 సిలిండ‌ర్ల‌ను ముందే తొల‌గించ‌డంతో.. పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒక వేళ ఆ సిలిండ‌ర్ల‌కు కూడా మంట‌లు వ్యాపిస్తే ప్ర‌మాదం ఘోరంగా ఉండేద‌న్నారు.  

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 50కి పైగా కూర‌గాయ‌ల షాపులు, మూడు టీ స్టాల్స్ తో పాటు ఇత‌ర దుకాణాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. మొత్తంగా 81 షాపులు కాలిపోయాయ‌ని అధికారులు చెప్పారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు.  అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo