e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టుర‌ట్టు

ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టుర‌ట్టు

ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టుర‌ట్టు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని చైత‌న్య‌పురి పోలీసుల‌తో కలిసి రాచ‌కొండ యాంటీ హ్యుమ‌న్ ట్రాఫికింగ్ యూనిట్ ఆన్‌లైన్ వ్య‌భిచార ముఠా గుట్టును ర‌ట్టుచేసింది. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో పోలీసులు ఉగాండాకు చెందిన ఐదుగురు మ‌హిళ‌ల‌ను అరెస్టు చేశారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుండి 20 గ్రాముల కెటామైన్‌తో పాటు ఇత‌ర డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లోకాంటో డేటింగ్ యాప్ ద్వారా నిందితులు వ్యభిచారం నిర్వహిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో వారు ఫోన్ నంబర్లతో పాటు మహిళల చిత్రాలను అప్‌లోడ్ చేశారు. పోలీసులు ట్రాక్ చేయకుండా ఉండటానికి ఈ-వాలెట్ల ద్వారా వినియోగదారుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు పర్యాటక వీసాలపై భారత్‌కు వచ్చారు. వీసాల గడువు ముగియ‌డంతో అక్రమ వ్యాపారానికి తెర‌తీశారు. వీరిలో మిల్లీ అనే వ్య‌క్తి గతేడాది డిసెంబర్‌లో ముంబై వచ్చింది. అక్క‌డినుంచి మార్చిలో హైదరాబాద్‌కు చేరుకుని టోలిచౌకి ప్రాంతంలో గ‌ది అద్దెకు తీసుకుని నివ‌సిస్తుంది. ఈమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంద‌ని చికిత్స కూడా తీసుకుంటున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఉగాండా నుండి మ‌హిళ‌ల‌ను ర‌ప్పించి ఇక్క‌డ వ్య‌భిచార వృత్తిలోకి బ‌ల‌వంతంగా దింపుతున్న‌ట్లు చెప్పారు. చైతన్య‌పురిలోని క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిసేందుకు వ‌చ్చిన‌ప్పుడు ఈ ముఠా బ‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టుర‌ట్టు

ట్రెండింగ్‌

Advertisement