యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

Nov 27, 2020 , 13:09:53

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ గేమ్‌ యువకుడి ప్రాణం తీసింది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో చివరకు అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్‌ (33) అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసై అప్పుల పాలయ్యాడు. ఇప్పటికే కొన్ని అప్పులు తీర్చినా.. మరిన్ని అప్పులు ఉండడంతో వాటిని తీర్చే మార్గం లేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను క్షమించాలని భార్యకు సెల్ఫీ వీడియోను పంపాడు. జగదీశ్ గతంలో రూ.12లక్షల వరకు అప్పులు తీర్చాడు. మిగతా అప్పును తీర్చేందుకు మరోసారి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి నష్టపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD