ఆదివారం 09 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 15:29:45

మాస్క్‌ల పేరుతో మస్కా..!

మాస్క్‌ల పేరుతో మస్కా..!

హైదరాబాద్‌ : కుందన్‌బాగ్‌కు చెందిన జూనస్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌లో మాస్కులు హోల్‌సెల్‌ ధరకు కొనాలని ప్రయత్నించాడు. ఇందుకు ఇంటర్‌నెట్‌లో ఒక వెబ్‌సైట్‌ చూసి.. అందు లో కొనేందుకు సదరు సంస్థ నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడారు. 10 మాస్కులు ఉన్న ఒక బాక్స్‌ రూ.30 చొప్పున విక్రయించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ముందుకొచ్చారు. వాళ్లిచ్చిన ఆఫర్‌ బాగుందని.. ఇందులో చాలా లాభాలొస్తాయని బాధితుడు భావించాడు. అంతలో అడ్వాన్స్‌గా కొంత డబ్బు చెల్లించాలని, టాక్స్‌లని, ఎన్‌ఓసీలు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట మొత్తం రూ.6.5 లక్షలు గుజరాత్‌ సైబర్‌నేరగాళ్లు స్వాహా చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటం, మాస్కులు పంపించకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


logo