బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 15:36:42

పిడుగు పాటుతో వ్యక్తి మృతి..మరో ఇద్దరికి గాయాలు

పిడుగు పాటుతో వ్యక్తి మృతి..మరో ఇద్దరికి గాయాలు

ఖమ్మం  : పిడుగు పాటుతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని వైరా మండలం తాటిపూడి గ్రామం వద్ద చోటు చేసుకుంది. గన్నవరం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఐలూరు వాసు రెడ్డి, మరో ఇద్దరు కలిసి ఒకే బండిపై వైరా నుంచి తాటిపూడి గ్రామానికి వెళ్తున్నారు. కాగా, వర్షం కురుస్తుండటంతో చెట్టు కిందకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పిడుగు పడటంతో వాసు రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.


logo