సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 05, 2020 , 14:23:37

వికాస్‌ దూబే అనుచరుడి అరెస్ట్‌

వికాస్‌ దూబే అనుచరుడి అరెస్ట్‌

కాన్పూర్‌ : పోలీసులపై కాల్పులు జరిపి పరారైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈయన గ్యాంగ్‌లోని 21 మందిని గుర్తించిన పోలీసులు వారిని కూడా పట్టుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. కాగా, దూబే అనుచరుడు దయాశంకర్‌ అగ్నిహోత్రి అలియాస్‌ కల్లూను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

గురువారం రాత్రి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వికాస్‌ దూబేపై రివార్డును పోలీసులు పెంచారు. ఇదివరకు ఆయన తలపై ఉన్న రూ.50 వేలను రూ.లక్షకు పెంచారు. కాగా, జవహర్‌పురం పులియాలోని ఇంటిని శనివారం రాత్రి గుర్తించిన పోలీసులు ఆయనను పట్టుకొనేందుకు వెళ్లగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పోలీసులు తిరిగి కాల్పులు జరుపగా అగ్నిహోత్రి కాలులో బుల్లెట్‌ దిగి కుప్పకూలిపోయాడు. దాంతో పోలీసులు ఆయనను స్థానిక దవాఖానకు తరలించారు. దూబేకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న అగ్నిహోత్రి.. ల్యాండ్‌ సెటిల్‌మెంట్లపై ఎక్కువగా దృష్టిపెట్టేవాడు. ఈయనపై కల్యాణ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే హత్యాయత్నం, ఆయుధాల చట్టకింద రెండు కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటికే దూబే అనుచరులు ఇద్దరిని పోలీసులు మట్టుబెట్టగా.. ఇంకా 18 మంది కోసం గాలిస్తున్నారు. వీరిపై కూడా రివార్డ్‌ ప్రకటించారు. 


logo