శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 12:02:15

వికారాబాద్ జిల్లాలో కరోనాతో ఒకరి మృతి

వికారాబాద్ జిల్లాలో కరోనాతో ఒకరి మృతి

వికారాబాద్ : జిల్లాలో కరోనాతో ఒకరి మృతి చెందారు. బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన చిక్కలి అనంతయ్య (65)కు కరోనా సోకడంతో 15 రోజుల నుంచి హైదరాబాద్ లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం రాత్రి అనంతయ్య మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అవసరం ఉంటే  తప్ప ప్రజలు బయటకు రావొద్దని, మాస్క్, శానిటైజర్ తప్పక వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. 


logo