సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 22, 2020 , 13:24:19

ఖమ్మం జిల్లాలో కరోనాతో ఒకరి మృతి

ఖమ్మం జిల్లాలో కరోనాతో ఒకరి మృతి

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ మండల కేంద్రానికి చెందిన జివాజి  కృష్ణారెడ్డి 62 అనే వర్తకుడు  బుధవారం ఉదయం కరోనా పాజిటివ్ తో మృతి చెందాడు. మృతుడు పాల్వంచ వర్తక సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకిన ట్లు నిర్ధారణ కావడంతో కొత్తగూడెం క్వారంటైన్ కేంద్రంలో లో ఉంచి వైద్యులు సేవలు అందించారు. బుధవారం ఉదయం మృతి చెందటంతో ప్రభుత్వ వాహనం ద్వారా మృతదేహాన్ని సరాసరి కుటుంబ సభ్యుల సూచన మేరకు స్మశాన వాటికకు తరలించారు. 

దహన సంస్కారం చేసేందుకు ఎవరు తోడు రాకపోవడంతో నలుగురు వ్యక్తులు మాత్రమే అక్కడకు వెళ్లి వారే దహన సంస్కారం నిర్వహించారు. కేవలం చాలామంది బంధువర్గం కుటుంబ సభ్యులు స్నేహితులు వ్యాపార వర్తకులు ఉన్నప్పటికీ కుటుంబానికి చెందిన.. బంధువుల లోని నలుగురు వ్యక్తులు మాత్రమే వైకుంఠ ధామానికి వెళ్లి దహన సంస్కారం నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.logo