సోమవారం 08 మార్చి 2021
Crime - Jan 15, 2021 , 18:18:50

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పడంతో ఒకరు మృతి చెందిన విషాద ఘటన వీపనగండ్ల మండలం కల్వరాల, ఫుల్గచర్ల గ్రామాల మధ్యలో జరిగింది. మారుతి 800 కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టడంతో డ్రైవర్‌ కుమ్మరి బాల నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా ఐదుగురికి గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

టీకా ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తీసుకోవ‌ద్దు ? 

క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలో మంత్రి అల్లోల‌ 

మంటల్లో పడి వృద్ధురాలి సజీవదహనం


VIDEOS

logo